రజనీకాంత్ ప్రమేయం లేకుండా రజనీకాంత్ ఫ్యాన్స్ క్లబ్ తరపున శ్రీధర్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు గత సోమవారం నామినేషన్ దాఖలు చేసారు .ఈ వ్యవహారంపై రజనీ తీవ్రంగా మండిపడ్డారు . తన అభిమానులు ఏ ఎన్నికల్లో ఏ పార్టీ తరపునైనా పోటీ చేసుకోవచ్చని, అయితే రాజకీయాల కోసం అభిమాన సంఘాల్ని వాడుకోకూడదని సూచించారు. ముఖ్యంగా శ్రీధర్‌ను ఉప ఎన్నికల నుంచి తప్పుకోవాలని ఆదేశిస్తూ, ఈ వ్యవహారం మొత్తాన్ని రజనీ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌కి అప్పగించారు.
ఈ విషయంపై పుదుక్కోటై జిల్లా అభిమానుల సంఘం కార్యకర్తలతో చర్చించి, ఆ తరువాత చర్యలు తీసుకుంటామని సుధాకర్ చెప్పారు.