రాష్ట్రవ్యాప్తంగా గాఢాంధకారం నెలకొంది. ఎప్పుడు విద్యుత్తు ఉంటుందో తెలియని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్తు ఉన్నప్పుడే పనులు చేసుకోవాలని కంగారుపండేంత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలున్నారు. దీనికి కారణాలు పరిశీలిస్తే ప్రభుత్వ నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే విద్యుత్తు ఆధారిత పరిశ్రమలు దెబ్బతిన్నాయి. నష్టం అంచనాలు లక్షలాది కోట్లాది రూపాయ
లకు చేరుకుంది. నిరంతర విద్యుత్తుపై ఆధారపడే పరిశ్రమలు ప్రతీనెలా తమ లీజులను, అద్దెలను చెల్లించి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ తరహా పరిశ్రమలు ప్రతీజిల్లాలోనూ 50కు తగ్గకుండా ఉన్నాయి. 24గంటలు విద్యుత్తుపై ఆధారపడిన కోళ్లపరిశ్రమల్లోనూ అద్దెలు చెల్లించి అమ్మకాలు జరిపేసి కొత్త ఉత్పాదనను ఆపేస్తున్నారు. విశాఖ ఉక్కుకారాగారంలో మూడు యూనిట్లు ఇప్పటికే మూసేశారు. మిగిలిన రెండు యూనిట్లను కూడా వీలైనంత త్వరలో మూసేందుకు యాజమాన్యం సిద్ధం అవ్వొచ్చు.
సుప్రీం కోర్టు ఇచ్చిన నోవర్కు నోపే కింద ఇక్కడ కార్మికులకు పెద్ద దెబ్బతగులుతోంది. జలవిద్యుత్తు, గ్యాస్‌ఆధారిత విద్యుత్తు, బొగ్గుపై ఆధారపడే విద్యుత్తు తయారీల్లో కొత్తపరిశ్రమలకు అనుమతులు ఇవ్వలేదు. అలానే ఉత్పత్తిపై ప్రభుత్వ అజమాయిషీ కూడా కొరవడిరది. అందుకే ఒక్కసారిగా జలవిద్యుత్తు ఆగిపోతే ఏమి చేయాలో తెలియని స్థితికి రాష్ట్రప్రభుత్వం చేరుకుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, సీలేరు తదితర జలవిద్యుత్తు కేంద్రాల్లో పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కనీసం విద్యుత్తు సమీక్షలు ఏడాదికోసారి అభివృద్థి దిశగా జరిపిన దాఖలాలు లేవు.
అలానే గ్యాస్‌పరిశ్రమలు రాష్ట్రంలో నెలకొల్పితే అజమాయిషీ కేంద్రానికి మాత్రమే ఉండేలా రాష్ట్రప్రభుత్వం తన హక్కును వదిలేసుకుంది. కాకినాడలో గ్యాస్ తయారు చేస్తే గుజరాత్‌కు అది తరలిపోతున్నప్పుడు రాష్ట్రప్రభుత్వం తన పర్సంటేజీని కోరకుండా గ్యాస్‌లిమిటేషను బాధ్యత కేంద్రానికి వదిలేసింది. దీంతో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింది. గ్యాస్, పెట్రోలియం శాఖా మంత్రి జైపాల్‌రెడ్డి కూడా కళ్లున్నా కబోదిలా రాష్ట్రఉత్పాదన ఇతరరాష్ట్రాలకు పోతుంటే ప్రేక్షకపాత్ర పోషించాడు. ప్రధాని మందలిస్తే కానీ, జైపాల్‌రెడ్డి తన కదలలేనితనాన్ని చాటుకున్నాడు. ఓ అసమర్ధమంత్రి, ఓ అసమర్ధ రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి విద్యుత్తు విషయంలో నాటకాలాడుతున్నాయని తెలుగుదేశం పార్టీ చేసిన విమర్శ నూటికి నూరుపాళ్లు నిజమే. ఇక్కడ ఖనిజసంపదను, ఇక్కడి గ్యాస్‌ను దోచుకుంటున్న గుజరాత్‌తో కాంట్రాక్టును తెగతెంపులు చేసుకునే ఆలోచన ఇప్పటి దాకా రాష్ట్రప్రభుత్వం చేయలేదంటే దాని సమర్ధత ఇక ప్రత్యేకంగా చెప్పాల్సినపని లేదు. ఓ రాష్ట్రప్రభుత్వం చేతకానిదైతే గాఢాంధప్రదేశ్‌గానే మిగులుతుందన్న విమర్శలకు తలొగ్గి కేంద్రం తాజాగా ఎన్‌టీపీసి సింహాద్రి నుంచి 350మెగావాట్ల విద్యుత్తు కేటాయించేందుకు సిద్ధమైంది. ఇదొక్కటీ రాష్ట్ర అవసరాన్ని తీర్చలేదన్న విషయం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గమనిస్తే బాగుంటుంది. గ్యాస్‌ప్లాంట్ల రద్దుకు ఉద్యమిస్తే కనీసం గ్యాస్‌సరఫరా అయినా మెరుగవుతుంది. ఈ విషయాన్ని ఈ దృతరాష్ట్ర ప్రభుత్వం గమనిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.