తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై ప్రధానికి లేఖ రాసిన ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి పైన ఆ పార్టీ నేతలు సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లక్ష్మీ పార్వతి తమ నేత గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే పిచ్చాసుపత్రిలో చేర్పిస్తామని హెచ్చరించారు. ఆమె తీరు పాలకుండలో బల్లిలా ఉందని విమర్శించారు. స్వర్గ
ీయ నందమూరి తారక రామారావు ఆగర్భ శత్రువుల అడుగులకు ఆమె మడుగులు ఒత్తుతున్నారని మండిపడ్డారు.
లక్ష్మీ పార్వతి, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానిలు జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ స్వర్గీయ ఎన్టీఆర్‌ను మరోసారి చంపేశారని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ ఆగర్భ శత్రువుల మోచేతి నీళ్లు తాగే వీరికి ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత ఎంతమాత్రమూ లేదన్నారు. ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని లక్ష్మీ పార్వతి జగన్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కుటుంబంలో ముసలానికి యార్లగడ్డనే కారణమన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యపై టిడిపి నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు, రావుల చంద్రశేఖర రెడ్డి ప్రభుత్వంపై వేరుగా మండిపడ్డారు. ప్రజలకు పొదుపు సూచనలు చేయడం కాదని వారి సమస్యలు తీర్చాలని హితవు పలికారు. ప్రభుత్వ కార్యాలయాలలో, మంత్రుల ఇళ్లలో పొదుపు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యుత్ సమస్యపై శ్వేత పత్రం విడుదల చేయాలని, లేదంటే తామే బ్లాక్ పేపర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ రాష్ట్రంలో ప్రతి స్కీమ్ కూడా స్కాంతోనే మొదలవుతోందన్నారు. విద్యుత్ సంక్షోభానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియే కారణమన్నారు. ప్రజావసరాలకు దూరంగా ప్రభుత్వం ఆలోచన ఉందన్నారు. ముఖ్యమంత్రి తమకు సమయం ఇస్తే విద్యుత్ పరిస్థితిపై ఆయనకు వివరిస్తామన్నారు. విద్యుత్ శాఖకు కనీసం మంత్రిని కూడా నియమించుకోలేని పరిస్థితిలో కాంగ్రెసు ఉందన్నారు. ప్రస్తుతం ప్రతిరోజు ప్రభుత్వానికి సెలవుగానే ఉందన్నారు.