Friday, 25 May 2012

సూపర్ స్టార్ రజినీ ఆగ్రహం


సూపర్ స్టార్  రజినీ ఆగ్రహం


రజనీకాంత్ ప్రమేయం లేకుండా రజనీకాంత్ ఫ్యాన్స్ క్లబ్ తరపున శ్రీధర్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు గత సోమవారం నామినేషన్ దాఖలు చేసారు .ఈ  వ్యవహారంపై రజనీ తీవ్రంగా మండిపడ్డారు . తన అభిమానులు ఏ ఎన్నికల్లో ఏ పార్టీ తరపునైనా పోటీ చేసుకోవచ్చని, అయితే రాజకీయాల కోసం అభిమాన సంఘాల్ని వాడుకోకూడదని సూచించారు.  ముఖ్యంగా శ్రీధర్‌ను ఉప ఎన్నికల నుంచి తప్పుకోవాలని ఆదేశిస్తూ, ఈ వ్యవహారం మొత్తాన్ని రజనీ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌కి అప్పగించారు.  
                                            ఈ విషయంపై పుదుక్కోటై జిల్లా అభిమానుల సంఘం కార్యకర్తలతో చర్చించి, ఆ తరువాత చర్యలు తీసుకుంటామని సుధాకర్ చెప్పారు.